Friday, 7 August 2026

M25 మూసివేత: ఆటంకాల గురించి డ్రైవర్లకు హెచ్చరిక!

Heathrow, Gatwick నుండి బయలుదేరే ట్రావెలర్లకు British Airways ఎక్స్ట్రాటైం అనుమతించాలని చెప్పింది.

సోమవారం వరకు M25 మోటార్‌వేలో ముఖ్యమైన భాగం మూసివేయటంతో ఈ వీకెండ్ లో ప్రయాణించే డ్రైవర్లకు ఎదురవ్వబోయే ఆలస్యం గురించి హెచ్చరికలు ఇచ్చారు. Woking సమీపంలోని జంక్షన్ 10 (Wisley), 11 మధ్య M25కి అదనపు లేన్లను జోడించే £317 మిలియన్ల ప్రాజెక్టులో భాగంగా రెండు డైరెక్షన్స్ లో రోడ్ క్లోజ్ చేయబడుతుంది. ఈ ఆటంకం శుక్రవారం 9AM నుండి సోమవారం 6AM వరకు వుంటుంది. ఈ మూసివేత కాలంలో “అవసరం పడితేనే” ప్రయాణం చేయమని నేషనల్ హైవేస్ కోరింది. ఒకవేళ ప్రయాణాలు చేయాల్సివస్తే ఆలస్యాలకు సిద్ధమై, అదనపు సమయాన్ని అట్టిపెట్టుకోవాలని కోరింది.

M25 అనేది UKలో అత్యంత రద్దీగా ఉండే రహదారి, ప్రతిరోజూ లక్షలాది మంది వినియోగదారులు దీనిపై ప్రయాణిస్తారు. Pedestrians, Cyclists, మోటార్‌వే దాటడానికి నేషనల్ హైవేస్ అనేక కొత్త నిర్మాణాలను ఏర్పాటు చేస్తోంది. జంక్షన్ 10 ప్రాజెక్ట్ ఈ సమ్మర్ లో పూర్తికావాల్సి ఉంది. కానీ తొమ్మిది నెలల “Extreme weather” కారణంగా, ఇప్పుడు 2026 స్ప్రింగ్ నాటికి పూర్తిచేయాలని చూస్తోంది.

ఈ మూసివేత సమయంలో, జంక్షన్ 10, A3 Wisley స్ట్రెచ్ చుట్టూ ఉన్న స్థానిక రోడ్లలో ట్రాఫిక్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దారి మళ్లింపుల కారణంగా లండన్, హీత్రూ, గాట్విక్ వెళ్ళే పాసెంజర్లు ఎయిర్పోర్ట్ కి చేరడానికి వీలుగా అదనపు సమయంతో తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోమని బ్రిటీష్ ఎయిర్వేస్ సూచించింది.

ఆల్టర్నేటీవ్ మార్గాలు: M25 జంక్షన్ 10 వద్ద క్లాక్ వైజ్ లో ప్రయాణించేవారు Painshill వద్ద A3 నార్త్ వైపు చేరడానికి, A245 తీసుకొని, ఆపై A320 తీసుకొని జంక్షన్ 11 వద్ద M25లో తిరిగి చేరడానికి ఆల్టర్నేటివ్ మార్గాలు వీలుకల్పిస్తాయి.

యాంటి క్లాక్ వైజ్ లో ఉన్న డ్రైవర్లు Dartford క్రాసింగ్ ద్వారా M25 తీసుకుంటే క్లోజర్ ని అవాయిడ్ చేస్తూ కూడా వేగంగా రావచ్చునని నేషనల్ హైవేస్ చెప్పింది.

ఈ నెలచివర్లో కూడా డ్రైవర్లు ఇదే జంక్షన్ మూసివేతను ఎదుర్కోవలసి ఉంటుంది. మార్చి 21న రాత్రి 9 గంటల నుండి మార్చి 24న ఉదయం 6 గంటల వరకు డైవర్షన్స్ వుంటాయి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు