Friday, 7 August 2026

మసాచుసెట్స్ ప్రసూతి విభాగంలో ఒకే అంతస్తులో పనిచేసే ఐదుగురు నర్సులకు మెదడు కణితులు ఉన్నట్లు నిర్ధారణ

మసాచుసెట్స్ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో ఒకే అంతస్తులో పనిచేస్తున్న ఐదుగురు నర్సులకు మెదడులో కణితులు అభివృద్ధి చెందాయి. NBC 10 Boston ప్రకారం, ఐదవ అంతస్తు యూనిట్‌లోని ఐదుగురు సిబ్బందికి నిరపాయకరమైన కణితులు ఉన్నట్లు న్యూటన్‌లోని మాస్ జనరల్ బ్రిగమ్ యొక్క న్యూటన్-వెల్లెస్లీ హాస్పిటల్ తెలిపింది. అదనంగా, మరో ఆరుగురు సిబ్బందికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు కనుగొనబడింది. ఏప్రిల్ 1 నుండి ఆసుపత్రి అధికారులు మరో 11 మందిని ఇంటర్వ్యూ చేశారు.

ప్రస్తుతం లేదా గతంలో ఆసుపత్రిలో అదే ప్రాంతంలో పనిచేసిన వ్యక్తులలో మెదడు కణితులు ఉన్నట్లు మాకు తెలిసిన తర్వాత, మేము ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ విభాగం, న్యూటన్-వెల్లెస్లీ సేఫ్టీ ఆఫీసర్, రేడియేషన్, ఫార్మాస్యూటికల్ సేఫ్టీ కార్యాలయాలు, బాహ్య పర్యావరణ సలహాదారుల సహకారంతో విస్తృతమైన దర్యాప్తు నిర్వహించాము” అని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.

మెదడు కణితి అభివృద్ధికి అనుసంధానించబడిన పర్యావరణ ప్రమాదాలు ఏవీ దర్యాప్తులో కనుగొనబడలేదు, అని కూడా ఆసుపత్రి తన ప్రకటనలో తెలియచేసింది. అయితే దీనితో, The Massachusetts Nurses Association విభేదించింది. ఆసుపత్రి ఆవరణ పరీక్ష సమగ్రంగా జరగలేదని, అది ముందుగానే నిర్ణయించిన ఫలితమని ఆ అసోసియేషన్ ఆరోపించింది. ఇది ముందుగానే నిర్ణయించిన ఫలితమని ఆ అసోసియేషన్ ఆరోపించింది. ఈ ఆరోపణను అంగీకరించని ఆసుపత్రి, తమ సిబ్బంది, రోగుల స్వస్థతే తమకు అత్యంత ముఖ్యమని తెలియచేసింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు