Friday, 7 August 2026

నోయిడాలో భారీ పోర్నోగ్రఫీ రాకెట్ గుట్టు రట్టు

నోయిడా దంపతులపై అంతర్జాతీయ సైబర్ సెక్స్ రాకెట్: ఈడీ రూ.15.66 కోట్లు స్వాధీనం

గత ఐదేళ్లుగా భార్యభర్తలు ఇద్దరూ ఈ దందా నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అలాగే, వీరికి అంతర్జాతీయంగా సంబంధాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ జంట నోయిడా ఇంటిపై దాడి చేసి రూ.15.66 కోట్ల అక్రమ విదేశీ నిధుల్ని Enforcement Directorate (ED) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నోయిడాలో ఉజ్వర్ కిషోర్, అతడి భార్య నీలు శ్రీవాస్తవ గత ఐదేళ్లుగా వ్యభిచార రాకెట్ దందా నడుపుతున్నారు. సైప్రస్ దేశానికి చెందిన టెక్నియస్ లిమిటెడ్ అనే సంస్థతో ఈ జంటకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంస్థ ఎక్స్ హామ్హర్, స్ట్రిప్టాట్ వంటి అడల్ట్ ఎంటర్ టైన్ మెంట్ వెబ్సైట్లను నిర్వహిస్తోంది.

నోయిడా కు చెందిన ఈ దంపతులు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్, ముఖ్యంగా ఫేస్బుక్ ద్వారా మోడల్స్ ని నియమించికుంటున్నారని అధికారులు తెలిపారు. మంచి జీతాలు ఇస్తామనే హామీలతో మోడలింగ్ అవకాశాలు అందిస్తామని “ఎచాటో డాట్ కామ్” అనే పేజీని క్రియేట్ చేశారన్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది మహిళలు ఈ ప్రకటనల ద్వారా వీరి వలలో చిక్కినట్లు చెప్పుకొచ్చారు. ఆడిషన్ల కోసం నోయిడాలోని ఆ జంట ఫ్లాట్ కు వచ్చిన తర్వాత వీరిని ఆ దందాలోకి లాగారన్నారు. నెలకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు జీతాన్ని ఇచ్చినట్లు గుర్తించారు. అధికారులు దాడి చేసిన సమయంలో ఈ జంట ఉంటున్న ఫ్లాట్లో ఒక ప్రొఫెషనల్ వెబ్ క్యామ్ స్టూడియోని ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. అడల్ట్ కంటెంట్ ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయన్నారు. వినియోగదారులు చేసే చెల్లింపుల ఆధారంగా మోడల్స్ టాస్క్లను చేసేవారని తెలిపారు. ఈ సేవలను ఉపయోగించడానికి వినియోగదారులు టోకెన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. కేటగిరీని బట్టి ఛార్జీలు మారుతూ ఉంటాయని ఆదాయంలో 75 శాతం దంపతులు ఉంచుకోగా, 25 శాతం మాత్రమే మోడల్కు ఇచ్చేవారన్నారు. కాగా, ప్రారంభంలో వినియోగదారుల నుండి క్రిప్టోకరెన్సీల ద్వారా చెల్లింపులు స్వీకరించేవారని చెప్పుకొచ్చారు. టెక్నియస్ లిమిటెడ్ ద్వారా రూ.7 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన నెదర్లాండ్ లోని ఒక బ్యాంక్ అకౌంట్ ని ED గుర్తించింది. ఈ నిధులను భారతదేశంలో ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులు ఉపయోగించి విత్ డ్రా చేసుకున్నారు. ఈ రాకెట్లో వేలాది మంది మహిళలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు