Friday, 7 August 2026

ఈ రోజు ‘స్త్రీ నిర్వచనం’ పై యుకె సుప్రీంకోర్టు తీర్పు

ఒక మహిళను చట్టంలో ఎలా నిర్వచించాలనే అనే దానిపై UK సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. స్కాటిష్ ప్రభుత్వం, ఓ మహిళా గ్రూప్ మధ్య దీర్ఘకాలంగా నడుస్తున్న న్యాయపోరాటం తుది దశకు చేరుకుంది. ఇది దేశంలో లింగ-ఆధారిత హక్కులు ఎలా వర్తిస్తాయనే దానిపై ఈ తీర్పు విస్తృత ప్రభావాన్ని చూపవచ్చు.

Gender Recognition Certificate తో ట్రాన్స్‌జెండర్లు జెండర్ ఆధారిత రక్షణ హక్కు కలిగి ఉంటారన్నది స్కాటిష్ ప్రభుత్వం వాదన. ఆడపిల్లగా జన్మించిన వారికి మాత్రమే అవి వర్తిస్తాయని విమెన్ స్కాట్లాండ్ అనే సంస్థ వాదిస్తోంది. ఒకే జెండర్ కు (ఆడ లేదా మగ) చెందిన స్థలాలు, సేవలు, సమాన వేతన దావాలు, ప్రసూతి విధానం, క్రీడా కార్యక్రమాలు వంటివాటిపై ఇవి ప్రభావం చూపొచ్చు. లింగ సంబంధిత సమస్యలపై తీవ్రమైన చర్చ జరుగుతున్న సమయంలో ఈ వాదనలు ముందుకొచ్చాయి.

2010 సమానత్వ చట్టం సరైన అర్ధాన్ని సుప్రీంకోర్టు నిర్ణయిస్తోంది. ఇది బ్రిటన్ అంతటా అమలు కానుంది. లింగపరమైన గుర్తింపు, లింగ మార్పిడి సహా వివిధ లక్షణాల ఆధారంగా వివక్షకు వ్యతిరేకంగా ఈ చట్టం రక్షణను అందిస్తుంది. జెండర్ అనే పదం అర్ధంపై లండన్‌లోని న్యాయమూర్తులు తీర్పు ఇవ్వనున్నారు. పుట్టుకతో వచ్చే జెండర్ గుర్తింపా, లేక 2004 జెండర్ గుర్తింపు చట్టం ప్రకారం లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులు పొందే సర్టిఫికెట్ ఆధారంగా లభించే న్యాయపరమైన గుర్తింపా అన్నది సుప్రీంకోర్టు తేల్చనుంది.

జీఆర్‌సీ పొందడమనేది “అన్ని ప్రయోజనాల కోసం” లింగ మార్పుకు సమానమని 2004 చట్టం స్పష్టంగా తెలియజేస్తోందని స్కాటిష్ ప్రభుత్వం చెబుతోంది. తాము కోరుకున్నట్టుగా జెండర్ మార్పిడి చేయించుకున్న వ్యక్తి…ఆ జెండర్ కి సంబంధించిన రక్షణలకు అర్హులని ప్రభుత్వ న్యాయవాది Ruth Crawford కోర్టుకు చెప్పారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు