Friday, 7 August 2026

250 మంది భారతీయులు 40 గంటలుగా ఎయిర్ పోర్ట్ లోనే కష్టాలు

టర్కీలో ఎయిర్‌పోర్టులో భారతీయుల తిప్పలు వర్ణనాతీతంగా ఉన్నాయి. లండన్ నుంచి ముంబై వస్తున్న వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్ (VS1358) ఎమర్జెన్సీగా టర్కీ దియార్ బకిర్ ఎయిర్‌పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. దీంతో ఫ్లైట్‌లో ఉన్న 250 మంది ప్రయాణికులు టర్కీ ఎయిర్‌పోర్ట్ లోనే చిక్కుకున్నారు. 40 గంటలకు పైగా విమానాశ్రయంలోనే వేచి ఉన్నారు. ఫ్లైట్ మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఆల్టర్నేటివ్ సర్వీస్ ఏదైనా ఏర్పాటు చేస్తారో లేదో ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

బుధవారం (ఏప్రిల్ 2) లండన్ నుంచి ముంబై వస్తున్న వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్ టర్కీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులలో ఒకరు కార్డియాక్ అరెస్ట్ కావడంతో మెడికల్ ఎమర్జెన్సీ కింద టర్కీ దియార్ బకిర్ ఎయిర్‌పోర్ట్ లో ఆపడం జరిగింది. ఆ తరువాత ఫ్లైట్ లో సాంకేతిక లోపం ఏర్పడటంతో రద్దు చేశారు అధికారులు. అప్పటి నుంచి ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు.

40 గంటలకు పైగా విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సరైన సదుపాయాలు కల్పించలేదని వాపోతున్నారు. కుర్చీలు, సోఫీలు, నేలపైనే పడుకుంటున్నామని, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఎయిర్‌పోర్టులో ఒకే ఒక టాయిలెట్ ఉందని, 250 మందికి ఒకే టాయిలెట్ కేటాయించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. తమను చాలా హీనంగా చూస్తున్నారని, మనుషులాగా కూడా చూడటంలేదని X లో పోస్ట్ చేశారు.

ప్రయాణికులకు సౌకర్యాల విషయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సిబ్బంది తెలిపారు. సాంకేతిక లోపంతో ఫ్లైట్ క్యాన్సిల్ చేశామని, టెక్నికల్ అప్రూవల్ వచ్చిన వెంటనే ఫ్లైట్ (VS1358) ను ప్రారంభిస్తామని తెలిపారు. శుక్రవారం (ఏప్రిల్ 4) సాయంత్రం వరకు భారతీయులను ముంబైకి చేర్చుతామని ప్రకటించారు. ఒకవేళ సాయంత్రం వరకు టెక్నికల్ అప్రూవల్ రాకపోతే బస్ ద్వారా మరో తుర్కిష్ ఎయిర్‌పోర్టుకు తరలించమని చెప్పారు. అక్కడి నుండి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు