Friday, 7 August 2026

14కు చేరిన ఎల‌న్‌ మ‌స్క్ పిల్ల‌ల సంఖ్య

ఎలాన్ భాగ‌స్వామి శివ‌న్ జిలిస్ తాజాగా కుమారుడిని జ‌న్మ‌నిచ్చింది. జిలిస్ చేసిన సోష‌ల్ మీడియా పోస్టుకు మ‌స్క్ ల‌వ్ సింబ‌ల్‌తో రిప్లై ఇచ్చారు. నాలుగ‌వ సంతానం క‌లిగిన జిలిస్ త‌న ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్ల‌డించింది. ఇద్ద‌రు క‌వ‌ల‌లు కాగా, ఓ కూతురు ఉన్న‌ది. తాజాగా షెల్డ‌న్ లైక‌ర్గ‌స్ పుట్టిన‌ట్లు శివ‌న్ త‌న పోస్టులో చెప్పింది.

కొన్ని రోజుల క్రితం ఆష్లే సెయింట్ క్లెయిర్ అనే మ‌హిళ కూడా మ‌స్క్ వ‌ల్ల కుమారుడికి జ‌న్మ‌నిచ్చిన‌ట్లు చెప్పింది. ఎంఏజీఏ ఇన్‌ప్లూయ‌న్స‌ర్ అయిన ఆ 26 ఏళ్ల మ‌హిళ‌.. మ‌స్క్‌కు 13వ సంతానం క‌లిగిన‌ట్లు ఇటీవ‌ల పేర్కొన్న‌ది. ఆ కుమారుడిని ఆర్ఎస్సీ అని కోర్టు ప‌త్రాల్లో తెలిపారు. మ‌స్క్ పాత్ర‌ను క‌న్ఫ‌ర్మ్ చేసేందుకు పెట‌ర్నిటీ టెస్టు చేయాల‌ని ఆమె కోరింది. ఆష్లే క్లెయిర్ ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం ఇవ్వాల‌ని న్యూయార్క్ జ‌డ్జి ఆదేశాలు జారీ చేశారు.

మ‌స్క్ ఫ్యామిలీలో ఇప్పుడు పిల్ల‌ల సంఖ్య 14కు చేరింది. శివ‌న్ జిలిస్‌తో న‌లుగురు, మొద‌టి భార్య జ‌స్టిన్ విల్స‌న్‌తో అయిదుగురు పుట్టారు. మ్యూజిక్ స్టార్ గ్రైమ్స్‌తో ముగ్గురు పిల్ల‌ల్ని క‌న్నాడు. త‌న వీర్య‌క‌ణాల‌ను స్నేహితులు, ఆశ్రితుల‌కు మ‌స్క్ దానం చేసిన విష‌యం తెలిసిందే.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు