Friday, 7 August 2026

చైనాతో చేతులు కలిపిన జుకర్ బర్గ్ సంచలన ఆరోపణలు : Sarah Wynn-Williams

CBS కథనం ప్రకారం Sarah Wynn-Williams వాంగ్మూలంలో చైనాలో వ్యాపార ఉనికిని పెంచుకోవడానికే మెటా కంపెనీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు. చైనాతో Mark Zuckerberg చేతులు కలిపారు. అందుకే పదే పదే అమెరికా జాతీయ భద్రతా విషయంలో మెటా రాజీ పడుతోంది. ఈ క్రమంలోనే అమెరికన్లతో సహా Meta వినియోగదారుల డేటా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లోకి వెళ్తేందని ఆరోపించారామె. మెటా కంపెనీ చైనా ప్రభుత్వం కోసం custom censorship tools రూపొందించింది. తద్వారా కంటెంట్ విషయంలో నియంత్రణ వాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. తాను స్వేచ్ఛావాదినని, దేశ భక్తుడినని అమెరికా జెండా కప్పేసుకుని ప్రకటించుకునే జుకర్బర్గ్.. గత దశాబ్దకాలంగా 18 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యం అక్కడ ఎలా స్థాపించుకోగలిగారు?. ఇది అమెరికన్లను మోసం చేయడమే అని ఆమె అన్నారు.

మెటా కంపెనీ చైనా ప్రభుత్వం కోసం కస్టమ్ సెన్సార్షిప్ ను టూల్స్ రూపొందించింది. తద్వారా కంటెంట్ విషయంలో నియంత్రణ వాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. తాను స్వేచ్ఛావాదినని, దేశ భక్తుడినని అమెరికా జెండా కప్పేసుకుని ప్రకటించుకునే జుకర్బర్గ్.. గత దశాబ్దకాలంగా 18 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యం అక్కడ ఎలా స్థాపించుకోగలిగారు? ఇది అమెరికన్లను మోసం చేయడమే అని ఆమె అన్నారు.
సారా విన్ విలియమ్స్ గతంలో ఫేస్బుక్లో గ్లోబల్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్గా పని చేశారు. ఏడేళ్లపాటు సంస్థలో పని చేసిన ఆమె.. ఈ ఏడాది మార్చిలో కేర్లెస్ పీపుల్ పేరిట ఒక నివేదికను పుస్తకాన్ని విడుదల చేసి తీవ్ర చర్చనీయాంశంగా మారారు. అయితే ఈ పుస్తకం పై మెటా కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆ పుస్తకాన్ని తాత్కాలికంగా నిషేధించింది.

అయితే బుధవారంనాటి విచారణ సందర్భంగా.. “ఫేస్బుక్ ఆ పుస్త విషయంలో ఆమెను ఎందుకు నిలువరించాలని అనుకుంటోంది?.. అమెరికన్లకు వాస్తవం తెలియాల్సి ఉంది” అని సెనేటర్ జోష్ హవ్యూలే అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తమ ఎదట హాజరై వివరణ ఇవ్వాలంటూ గురువారం జుకర్ బర్గ్కు ఆయన ఓ లేఖ రాశారు. వాస్తవాలు బయటపెడితే తనను కోర్టుకు ఈడుస్తామంటూ మెటా బెదిరిస్తోందని సారా విన్ విలియమ్స్ చెబుతుండగా.. ఆమె ఆరోపణలన్నీ అవాస్తవమేనని, చైనాలో తమ కార్యకలాపాలు నడవడం లేదని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు