Friday, 7 August 2026

అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల టైమ్స్ జాబితాలో చోటు దక్కని భారతీయులు.

టైమ్స్ మ్యాగజైన్ 2025 గానూ ప్రపంచంలో వివిధ రంగాలకు చెందిన 100 మంది మోస్ట్ influential పీపుల్‌ జాబితాను విడుదల చేసింది. ఇందులో ట్రంప్, నోబెల్ బహుమతి గ్రహీత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, యూకే ప్రధాని కీవ్ స్టార్మర్‌, ప్రపంచ కుబేరుడు.. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఏప్రిల్ 17న విడుదలైన ఈ జాబితాలో రాజకీయాలు, సైన్స్, కళలు, ఇతర క్రియాశీల రంగాల్లో ప్రజలను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులను ఎంపిక చేస్తారు. అయితే, ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో తొలిసారి భారతీయ పౌరుల్లో ఒక్కరికీ కూడా చోటు దక్కకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ, 11 సంవత్సరాల వయసులో భారతదేశం నుంచి అమెరికాకు వలస వెళ్లి వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ CEO గా వ్యవహరిస్తున్న రేష్మా కేవల్రమణికి లీడర్స్ విభాగంలో టైమ్స్ జాబితాలో స్థానం దక్కింది.

ఇంకా 2025 టైమ్స్ లిస్ట్ లో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్ భామ్, వెనెజులా ఐరన్ లేడీ మరియా కోరినా మచాడో ఉన్నారు. ఇంకా మార్వెల్ సిరీస్ ఫేం స్కార్లెట్ జాన్సన్, సింగర్ ఎడ్ షీరన్, నటి డెమీ మూర్, మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్, జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్ వంటి ప్రముఖులకు స్థానం లభించింది. గతేడాది ఇండియా నుంచి అలియా భట్, ఒలింపియన్ రెజ్లర్ సాక్షి మలిక్‌కు వంటి భారతీయులతో పాటు భారత సంతతికి చెందిన అనేక మందికి చోటు దక్కింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు