Friday, 7 August 2026

మయన్మార్ లో ప్రార్ధనలు చేస్తూనే 700 మంది సజీవ సమాధి

మయన్మార్‌లో రంజాన్ శుక్రవారం సందర్భంగా ప్రార్థనలు చేస్తుండగా 700 మందికి పైగా సజీవ సమాధి అయ్యారు.

మయన్మార్‌లోని ముస్లీం ఆర్గనైజేషన్ సోమవారం వెల్లడించింది. మయన్మార్‌లో రెండవ అతి పెద్ద నగరమైన మాండలేలో రిక్టర్ స్కేల్‌పై 7.7 రీడింగ్‌తో పెను భూకంపం సంభవించడాన్ని మయన్మార్ అధికారులు వెల్లడించారు. ఈ విలయంలో వందల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. 60కి పైగా మసీదులు తీవ్రంగా ధ్వంసమయ్యాయని ‘స్ప్రింగ్ రివల్యూషన్ మయన్మార్ నెట్‌వర్క్’ కమిటీ సభ్యుడు టున్ కీ తెలిపారు.

మధ్యాహ్న సమయంలో ప్రార్థనలు చేస్తున్నప్పుడే భూకంపం సంభవించడంతో 700 మందికి పైగా శిధిలాల కింద మరణించినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ మరణాలను అధికారిక లెక్కలలో చేర్చారా లేదా అన్న విషయం స్పష్టత లేదు.

మయన్మార్ భూకంప విపత్తులో 1,700 మందికి పైగా మరణించినట్లు మిలటరీ ప్రభుత్వం ప్రకటించింది. మరో 3,400 మంది తీవ్రంగా గాయపడ్డారు. 300 మందికి పైగా వ్యక్తుల ఆచూకీ దొరకలేదు.

అంతర్యుద్ధంతో కుంగిపోతున్న మయన్మార్ ఈ ఘోర విపత్తుతో మరింత కకావికలమై పోయింది. భూకంపం కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ తెగిపోవడం, రహదారులు, వంతెనలు దెబ్బతినడం, సహాయక చర్యలు కుంటుపడటం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. మాండలే వీధుల్లోని భవనాల శిధిలాల కింద శవాలు కుళ్లిపోవడంతో దుర్గంధం వ్యాప్తి చెందుతోంది.

ఈ విపత్తు సందర్భంగా పొరుగు దేశమైన భారత్ సహాయం అందించింది. 15 టన్నుల సహాయక సామాగ్రిని తక్షణ సాయంగా పంపింది. 60 మంది NDRF సిబ్బందిని కూడా మయన్మార్‌కు పంపింది.


ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు