Friday, 7 August 2026

స్త్రీల శరీరాలు యుద్ధ మైదానాలుగా మారిపోయాయి: Regional Director of UN Women

సుడాన్‌లో అత్యాచారాన్ని వ్యవస్థాపితంగా యుద్ధ ఆయుధంగా ఉపయోగిస్తున్నారని ఒక UN agency హెచ్చరించింది. ఈ యుద్ధం మూడో సంవత్సరంలోకి ప్రవేశించగా ఈ విషాదకర విషయం Reuters report లో వెల్లడైంది.

జనీవాలో విలేకరులతో వీడియో లింక్ ద్వారా మాట్లాడిన UN ఉమెన్ ప్రాంతీయ డైరెక్టర్ Anna Mutavati చెప్పిన వివరాల ప్రకారం:
“అత్యాచారం మరియు లైంగిక హింస నుండి బతికిన మహిళలకు కావలసిన అత్యవసర సహాయానికి డిమాండ్ 288 శాతం పెరిగింది. లైంగిక హింసను యుద్ధ ఆయుధంగా ఉపయోగిస్తున్న ఘోరమైన పరిస్థితిని చూస్తున్నాం,” అని ఆమె పేర్కొన్నారు.

“స్త్రీల శరీరాలు యుద్ధ మైదానాలుగా మారిపోయాయి,” అని ఆమె అన్నారు. అయితే సుడాన్ యుద్ధంలో ఈ అమానవీయ చర్యలకు ఎటువంటి పక్షం బాధ్యతవహించిందనేది ఆమె వెల్లడించలేదు.

2023 ఏప్రిల్‌లో ప్రారంభమైన యుద్ధం సుడాన్ సైన్యం మరియు Paramilitary Rapid Support Forces (RSF) మధ్య కొనసాగుతోంది. ఇది సివిలియన్ పరిపాలనకు మారే ఆశలను తుంచేసింది.
ఈ సంఘర్షణలో మిలియన్ల మంది బలవంతంగా తరలించబడ్డారు, ముఖ్యంగా డార్ఫూర్ ప్రాంతం పూర్తిగా నాశనం అయింది. ఆ ప్రాంతంలో సైన్యం ముందుకుసాగుతున్న నేపథ్యంలో RSF తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు పోరాటం చేస్తోంది.

మరింత దారుణంగా, ముటవతి చెప్పారు:
“ఇది కేవలం పైపైనే కనిపిస్తున్నది మాత్రమే. ఎందుకంటే అత్యాచారానికి గురైన ప్రతి మహిళను సమాజం నిందిస్తుంది. అందువల్ల చాలా మంది బయటకు రారు.”

ఒక UN fact-finding mission గత సంవత్సరం, చిన్న పిల్లలపై అత్యాచారం సహా విస్తృత స్థాయిలో లైంగిక దాడులను “అలజడి కలిగించే స్థాయిలో ఉన్నాయని వర్ణించింది. అందులో చాలా వరకు కేసులు RSF మరియు వారి మిత్రులు జరిపినవేనని చెప్పింది. అయితే సైన్యం ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో నివేదికలు ఇవ్వడం మరింత కష్టం అయ్యిందని కూడా పేర్కొంది.

ఇంకొక యుఎన్ ఏజెన్సీ ప్రతినిధి మొహమ్మద్ రెఫాత్ తెలిపినదానిబట్టి:
“ఖర్తూమ్‌లో నేను కలిసిన కొందరు మహిళలు తమ గాయపడ్డ భర్తలు, అరుస్తున్న పిల్లల ఎదుటనే తమపై లైంగిక దాడి జరిగినట్లు చెప్పారు.”
“నా జీవితంలో ఇంతటి దారుణంగా బాధపడ్డ మహిళలను నేను ఎప్పుడూ చూడలేదు,” అని రెఫాత్ అన్నారు, ఆయనే సుడాన్‌లో అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) మిషన్ కు నాయకత్వం వహిస్తున్నారు.

ఈ యుద్ధంలో మహిళలపై జరుగుతున్న పీడన అంతర్జాతీయ మానవహక్కుల విపరీత ఉల్లంఘనగా నిలుస్తోంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు