Friday, 7 August 2026

ట్రంప్ మరో సంచలనం.. 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్..

ప్రపంచంలోని 41 దేశాల ప్రజలపై అమెరికాలోకి అడుగుపెట్టకుండా ప్రయాణ ఆంక్షలు విధించాలని డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఒక ఇంటర్నల్‌ మెమో బయటికొచ్చినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే మొత్తం ఈ 41 దేశాలను 3 గ్రూప్‌లుగా విభజించనున్నారని సమాచారం. మొదటి గ్రూప్‌లో 10 దేశాలను చేర్చనున్నారు. అఫ్గానిస్థాన్‌, ఇరాన్‌, సిరియా, క్యూబా, ఉత్తరకొరియా లాంటి 10 దేశాలకు చెందిన పౌరులకు అమెరికా వీసాలు జారీ చేయడం పూర్తిగా నిలిపివేయనున్నారు.

ఇక రెండో గ్రూప్‌లో ఇరిట్రియా, హైతీ, లావోస్‌, మయన్మార్‌, దక్షిణ సూడాన్‌ వంటి దేశాలను చేర్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి దేశాలపై పాక్షిక ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ దేశాలకు చెందిన పౌరులకు పర్యాటక, విద్యార్థి వీసాల వంటివి జారీ చేయకూడదని భావిస్తున్నారు. అయితే వీటికి కొన్ని మినహాయింపులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

మూడో గ్రూప్‌లో పాకిస్థాన్‌, భూటాన్‌ సహా మొత్తం 26 దేశాలు ఉన్నట్లు సమాచారం. ఈ దేశాలు 60 రోజుల్లోపు తమ లోపాలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఇస్తారు. ఒక వేళ ఆ దేశాలు ఆ ప్రయత్నాలు చేయడంలో విఫలం అయితే.. అక్కడి పౌరులకు వీసా జారీని పాక్షికంగా నిలిపివేయాలని అమెరికా యంత్రాంగం భావిస్తున్నట్లు ఆ మెమోలో ఉంది. అయితే ఈ లిస్ట్‌ను అమెరికా మీడియా సంస్థలు వెల్లడించగా, ఆ జాబితాలో మార్పులు ఉండవచ్చని అమెరికా ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. అయితే అమెరికా విదేశాంగమంత్రి Marco Rubio ఆమోదించిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు