Friday, 7 August 2026

బ్లాక్‌ మండే కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు: ట్రంప్ ఎఫెక్ట్‌

సోమవారం ప్రారంభం కాగానే.. దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి.. Sensex 3900 పాయింట్లకు పైగా పడిపోయింది.. నిఫ్టీ 1140 పాయింట్లకు పైగా నష్టంలో పతనమైంది. స్టాక్‌ మార్కెట్లపై ట్రంప్‌ సుంకాల ఎఫెక్ట్ కనిపించింది.. మొత్తంగా భారత స్టాక్‌ మార్కెట్లు 5 శాతం నష్టపోయాయి.. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా సహా మౌలిక రంగాల షేర్లు అన్ని పతనమయ్యాయి.

డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల బాంబ్‌కు- ప్రపంచమంతా బెంబేలెత్తిపోతోంది. రైతుల నుంచి స్టాక్‌మార్కెట్ల వరకు అంతా గోలగోల. ప్రపంచంపై ట్రంప్‌ వేసిన సుంకాల ఆటంబాంబ్‌ ఏ రేంజ్‌లో ఉందో నేడు కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌లతో అర్ధమవుతోంది.. ట్రంప్‌ ప్రతీకార సుంకాలతో ప్రపంచ స్టాక్‌మార్కెట్లతో పాటు.. భారత స్టాక్ మార్కెట్‌లలో కల్లోలం కనిపిస్తోంది. సోమవారం ప్రారంభం కాగానే.. దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి.. సెన్సెక్స్ 3900 పాయింట్లకు పైగా పడిపోయింది.. నిఫ్టీ 1140 పాయింట్లకు పైగా నష్టంలో పతనమైంది. స్టాక్‌ మార్కెట్లపై ట్రంప్‌ సుంకాల ఎఫెక్ట్ కనిపించింది.. మొత్తంగా భారత స్టాక్‌ మార్కెట్లు 5 శాతం నష్టపోయాయి.. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా సహా మౌలికరంగాల షేర్లు అన్ని పతనమయ్యాయి.

ట్రంప్‌ ప్రతీకార సుంకాలతో ప్రపంచ స్టాక్‌మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి.. ఆసియా, ఆస్ట్రేలియా మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కనిపిస్తున్నాయి. జపాన్‌ నిక్కీ 8 శాతం, కొరియా కోస్పి సూచీ 5 శాతం డౌన్‌ అయ్యాయి. ఆస్ట్రేలియా స్టాక్‌మార్కెట్‌ 6 శాతం పడిపోయింది. హాంకాంగ్‌ స్టాక్‌మార్కెట్లు 9 శాతం పతనం అయ్యాయి. అయితే- స్టాక్‌మార్కెట్ల ఈ మహా పతనాన్ని ట్రంప్‌ ఏమాత్రం లెక్కచేయడం లేదు. సుంకాలను మెడిసిన్‌ అంటూ ప్రెసిడెంట్‌ అభివర్ణించడం కలకలం రేపుతోంది.. స్టాక్‌మార్కెట్ల పతనంపై ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తంచేస్తుండగా.. ట్రంప్ మాత్రం ఈ సుంకాలను- రోగానికి మందు అనే అర్థం వచ్చేలా అభివర్ణిస్తున్నారు. ట్రంప్‌ సుంకాల నిర్ణయాలతో అమెరికా స్టాక్‌మార్కెట్లు దారుణంగా నష్టపోయాయి. ఈ తెల్లవారుజామున మొదలైన ఆసియా, ఆస్ట్రేలియా మార్కెట్లు కూడా తీవ్రంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌, చైనా, హాంకాంగ్‌, దక్షిణకొరియా ఇలా అన్నిచోట్లా ఇదే పరిస్థితి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు