Friday, 7 August 2026

హమాస్ తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో అమెరికాలో భారతీయ విద్యార్ధి అరెస్ట్

హమాస్ సంస్థతో లింకులు ఉన్నాయన్న అభియోగాలతో బాదర్ ఖాన్ సూరి అనే రీసర్చర్ ను అక్కడి భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. త్వరలో ఆయన్ని ఇండియాకు తిరిగి పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే ఈ చర్యలను సవాల్ చేస్తూ ఆయన కోర్టుకు ఎక్కారు.

బాదర్ ఖాన్ సూరి (Badar Khan Suri) వాషింగ్టన్ జార్జిటౌన్ యూనివర్సిటీలో రీసర్చర్ గా ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వర్జీనియాలోని ఆయన నివాసం వద్ద ఫెడరల్ ఏజెంట్లు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన వీసా కూడా రద్దుచేసినట్లు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెూంల్యాండ్ సెక్యూరిటీ (DHS) తెలిపింది. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ తో సంబంధాలు ఉండడం, సోషల్ మీడియాలో యూదు వ్యతిరేకతను ప్రచారం చేయడం లాంటి నేరాలకు పాల్పడినందుకు బాదర్ ఖాన్ సూరిని అదుపులోకి తీసుకున్నట్లు, ఆయన్ని ఇండియాకు పంపించే ప్రయత్నాల్లో ఉన్నట్లు డీహెచ్ఎస్ స్పష్టం చేసింది.

మరోవైపు తన అరెస్ట్, తరలింపు ప్రయత్నాలను ఇమ్మిగ్రేషన్ కోర్టులో సూరి సవాల్ చేశారు. తన భార్య పాలస్తీనా మూలాలు ఉండడంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని, తనకు ఎలాంటి నేరచరిత లేదని తన పిటిషన్లో సూరి పేర్కొన్నారు. భారత్ కు చెందిన బాదర్ ఖాన్ సూరి స్వస్థలం ఎక్కడ అనేదానిపై స్పష్టతలేదు. అయితే ఆయన విద్యాభ్యాసం అంతా భారత్ లోనే గడిచినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో, పీస్ అండ్ కాప్లిక్ట్ స్టడీస్ పైన PhD చేసిన ఆయన.. ఆపై ఇరాక్, అఫ్గనిస్థాన్ లో శాంతిస్థాపనకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేశారు.

ఇక, ఈ ఘటనపై జార్జ్ టౌన్ యూనివర్సిటీ స్పందించింది. ‘బదర్ ఖాన్ సూరి డాక్టోరల్ పరిశోధకుడిగా ఉన్నారు. సూరి ఎలాంటి చట్టవిరుద్ధమైన చర్యల్లో పాల్గొంటున్నారనేది, ఈ అరెస్టుకు కారణం ఏంటనేది మాకు తెలియలేదు. ఈ కేసుకు సంబంధించి బహిరంగ విచారణకు మేం పూర్తిగా మద్దతిస్తున్నాం. కోర్టు న్యాయబద్ధమైన తీర్పునిస్తుందని ఆశిస్తున్నాం’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.

పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై ట్రంప్ సర్కారు తీవ్ర చర్యలు తీసుకుంటోంది. గతేడాది ఏప్రిల్లో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చెలరేగాయి. దీంతో దాదాపు 2,000 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఇక ఇటీవల కొలంబియా యూనివర్సిటీలోనూ పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు జరిగాయి. వీటికి మద్దతు తెలిపిన భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసాను డీహెచ్ఎస్ రద్దుచేసింది. దీంతో ఆమె స్వీయ బహిష్కరణకు గురైనట్లు అధికారులు ప్రకటించారు.

అమెరికాకు వలస వెళ్లిన బాదర్, మఫెజ్ అహమద్ యూసఫ్ సలేహ్ అనే పాలస్తీనా మూలాలు ఉన్న అమెరికన్ పౌరురాలిని వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి హమాస్ లో కీలక నేత అయిన అహ్మద్ యూసెష్ గా DHS ప్రకటించింది. బాదర్ ఖాన్ సూరి అరెస్ట్ కావడంతో జాతీయ భద్రతా, వ్యక్తిగత హక్కులు, విద్యాలయాలపై రాజకీయాల ప్రభావం లాంటి అంశాలు చర్చకు వచ్చాయి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు