Friday, 7 August 2026

ముప్ఫై రోజుల్లో దేశాన్ని వీడండి: అమెరికా హెచ్చరిక

Americaలో ఎక్కువ కాలం నివసిస్తున్న విదేశీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని Department of Homeland Security (DHS) హెచ్చరికలు జారీచేసింది. అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్నవారు తప్పనిసరిగా Federal Government వద్ద రిజిస్టర్ చేసుకోవాలని, ఆ నిబంధన ఉల్లంఘిస్తే నేరం కింద పరిగణించి అపరాధ రుసుము, జైలు శిక్ష విధిస్తామని DHS స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. అందుకే స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపొమ్మని ఆదేశాలు జారీచేసింది. America లో నేర చరిత్ర లేనివారు తాము సంపాదించిన సొమ్ముని తీసుకెళ్లిపోవచ్చని, ఒకవేళ అలాంటివారికి విమాన టికెట్ల ఖర్చుకి ఇబ్బంది అయితే తాము రాయితీ ఇస్తామని కూడా ప్రకటించింది.

పై నిబంధనలు పాటించని వారిని దేశం నుండి పంపేస్తామని, ఫైనల్ ఆర్డర్ అందుకున్న తరువాత ప్రతి ఒక్కరోజు ఆలస్యానికి 988 డాలర్ల ఫైన్, స్వంతగా వెళ్లకపోతే 1000 నుందు 5000 డాలర్ల ఫైన్ విధించనున్నామని తెలిపారు. వారికి జైలు శిక్ష విధించే అవకాశంతో పాటు భవిష్యత్తులో అమెరికాలోకి ప్రవేశం సాధ్యం కాకపోవచ్చు. ఈ హెచ్చరికలను టెలివిజన్, రేడియో, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా DHS విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో, DHS 145 దేశాలకు చెందిన సుమారు 1.6 లక్షల అక్రమ వలసదారులను 495 అంతర్జాతీయ విమానాల ద్వారా వారి స్వదేశాలకు పంపింది. ఇందులో భారత్‌కు చెందినవారు కూడా ఉన్నారు. ఈ చర్యలు భారత ప్రభుత్వ సహకారంతో చేపట్టబడ్డాయి. ఇలాంటి చర్యల ద్వారా అమెరికా అక్రమ వలసలను తగ్గించడానికి కృషి చేస్తోంది. అక్రమంగా నివసిస్తున్నవారు తమ స్వదేశాలకు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది.​​

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు