Friday, 7 August 2026

అమెరికా మ‌ద్యంపై 150% tax విధిస్తున్న భార‌త్: Whitehouse

డోనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధం నేప‌థ్యంలో.. ఇండియాపై శ్వేత సౌధం కీల‌క ఆరోప‌ణ చేసింది. అమెరికా మ‌ద్యం, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌పై .. భార‌త్ అధిక స్థాయిలో సుంకాలు వ‌సూల్ చేస్తున్న‌ట్లు చెప్పింది. అమెరిక‌న్ మ‌ద్యంపై భార‌త్ 150 శాతం దిగుమ‌తి సుంకాన్ని వ‌సూల్ చేస్తున్న‌ట్లు వైట్‌హౌజ్ ప్రెస్ కార్య‌ద‌ర్శి క‌రోలిన్ లివిట్ తెలిపారు. అమెరికా వ‌స్తువుల‌పై వివిధ దేశాలు విధిస్తున్న సుంకాల‌కు సంబంధించిన గ‌ణాంక వివ‌రాల‌ను ఆమె వైట్‌హౌజ్‌లో మీడియాకు వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా మ‌ద్యంపై ఇండియా భారీగా సుంకాన్ని వ‌సూల్ చేస్తుంద‌న్నారు.

కెన‌డాతో జ‌రుగుతున్న ట్రేడ్ వార్ గురించి ప్ర‌శ్న వేయ‌గా ఆమె ఇండియాపై కూడా రియాక్ట్ అయ్యారు. అమెరికాను, దేశానికి చెందిన హార్డ్ వ‌ర్కింగ్ అమెరిక‌న్ల‌ను కూడా కెన‌డా మోసం చేస్తోంద‌న్నారు. అమెరికా ప్ర‌జ‌లు, వ‌ర్క‌ర్ల‌పై కెన‌డా స‌ర్కారు అత్య‌ధిక స్థాయిలో టారిఫ్‌లు వ‌సూల్ చేస్తున్న‌ట్లు ప్రెస్ సెక్ర‌ట‌రీ ఆరోపించారు. కెన‌డా, భార‌త్‌, జ‌పాన్ లాంటి దేశాలు వ‌సూల్ చేస్తున్న సుంకాల‌కు చెందిన ఛార్ట్‌ను ఆమె ప్ర‌జెంట్ చేశారు. అమెరికాకు చెందిన చీజ్‌, బ‌ట‌ర్‌పై 300 శాతం సుంకాన్ని కెన‌డా వ‌సూల్ చేస్తున్న‌ట్లు ఆరోపించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు